business

ముఖేష్ అంబానీ తన కొడుక్కి ఎంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారో తెలుసా

కొడుకు కోడళ్లకు కానుక

ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు తమ కుమారుడు, కోడలికి దుబాయ్‌లో ఈ బంగ్లాను బహుమతిగా ఇచ్చారు.

విలాసవంతమైన బంగ్లా

దుబాయ్‌లోని అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్‌ల ఈ మెరిసే బంగ్లా ధర రూ.కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. లోపల ఏముందో తెలుసుకుందాం. రండి

కోట్ల విలువైన కానుక

ముఖేష్, నీతా అంబానీలు తమ ప్రియతమైన చిన్న కుమారుడు, కోడలికి దుబాయ్‌లో బహుమతిగా ఇచ్చిన బంగ్లా ధర అక్షరాల రూ.650 కోట్లు

అత్యంత ఖరీదైన ఆస్తుల్లో ఒకటి

అనంత్, రాధికల బంగ్లాలో మొత్తం 10 గదులు ఉన్నాయి. 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లా దుబాయ్‌లోని అత్యంత ఖరీదైన ఆస్తుల్లో ఒకటి. 

బంగ్లాలోనే బీచ్

ఈ జంట వారి వ్యక్తిగత ఉపయోగం కోసం లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన బీచ్ ఉంది. ఇది దాదాపు 70 మీటర్ల పొడవుంటుంది. 

ఇంకా ఏమున్నాయి?

ఈ బంగ్లాలో రెండు స్విమ్మింగ్ పూల్స్, ఏడు స్పాలు ఉన్నాయి. 10 విశాలమైన బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. ఇంటీరియర్ స్వర్గంలో ఉన్నామా అనిపించేటట్లు ఉంటుంది. 

ఇటాలియన్ పాలరాయి

ఇది అనంత్-రాధిక మర్చెంట్ కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఈ బంగ్లా ఇటాలియన్ పాలరాయితో తయారు చేశారు. 

అత్యంత ఖరీదైన ఫర్నీచర్

నీతా తన చిన్న కుమారుడి కోసం ప్రపంచంలోని వివిధ దేశాల నుండి ఖరీదైన ఫర్నీచర్‌ను తెప్పించి బంగ్లాకు కొత్త అందాన్ని తెచ్చారు. 

నెల క్రితం పెళ్లి

అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ నెల రోజుల క్రితం అంటే జూలై 12న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.

ATM నుంచి రోజుకు ఎంత నగదు తీసుకోవచ్చు? టాప్ 5 బ్యాంకుల లిమిట్ ఎంత‌?

టాటా EV కార్లపై బంపర్ ఆఫర్ - 3 లక్షలు తగ్గింపు

స్టీవ్ జాబ్స్ ఆ ఇ-మెయిల్ చూడకపోతే ఇప్పుడు మనచేతిలో ఐ-ఫోన్ ఉండేది కాదు

SIPలో ఇన్వెస్ట్ చేస్తున్నారా ఈ టిప్స్ పాటిస్తే రూ.5 కోట్లు మీ సొంతం