business
UPI లావాదేవీలు పెరిగినా, చాలా మంది ఇప్పటికీ నగదుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ATMల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవడం సులభమే అయినా, బ్యాంకులు దానికి లిమిట్స్ పెట్టాయి.
ATM ల నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే లిమిట్స్ అన్ని బ్యాంకుల్లోనూ ఒకేలా ఉండదు. SBI, PNB, HDFC, యాక్సిస్ బ్యాంక్, BOB ల ATM నగదు విత్‌డ్రా రూల్స్ మీకోసం
SBI వివిధ రకాల డెబిట్ కార్డులపై నగదు విత్‌డ్రా క్లాసిక్ డెబిట్ కార్డ్, మెస్ట్రో కార్డ్‌లతో రోజుకి 20,000, ప్లాటినం ఇంటర్నేషనల్ కార్డ్‌తో 1 లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
గో లింక్డ్, టచ్‌టాప్ కార్డుల పరిమితి 40,000. మెట్రో నగరాల్లో నెలకు 3, ఇతర నగరాల్లో 5 ఉచిత లావాదేవీల తర్వాత SBI ATM లపై 5, SBI కాని ATM లపై 10 రూపాయలు వసూలు చేస్తారు.
PNB ఖాతాదారులకు కూడా డెబిట్ కార్డులపై నగదు విత్‌డ్రా పరిమితి ఉంది. PNB ప్లాటినం డెబిట్ కార్డ్‌తో రోజుకి 50,000 రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
PNB క్లాసిక్ డెబిట్ కార్డ్‌తో 25,000, గోల్డ్ డెబిట్ కార్డ్‌తో కూడా 50,000 వరకు విత్‌డ్రా వుండగా, మెట్రో నగరాల్లో 3 సార్లు, ఇతర నగరాల్లో 5 సార్లు ఉచితంగా విత్‌డ్రా అవకాశమిచ్చింది.
HDFC బ్యాంక్ మిలీనియా, రివార్డ్స్ కార్డులపై రోజుకి 50,000 వరకు, మనీబ్యాక్ డెబిట్ కార్డ్‌పై 25,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. నెలకు 5 ఉచిత లావాదేవీల తర్వాత ఛార్జీలు వర్తిస్తాయి.
యాక్సిస్ బ్యాంక్‌లో నగదు విత్‌డ్రా పరిమితి రోజుకి 40,000 రూపాయలు. అంతేకాకుండా, అన్ని విత్‌డ్రాలపై 21 రూపాయల రుసుము వసూలు చేస్తారు.
BOB BPCL, మాస్టర్ కార్డ్ DI ప్లాటినం డెబిట్ కార్డులతో రోజుకి 50,000 రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మాస్టర్ కార్డ్ క్లాసిక్ DI కార్డ్‌పై రోజువారీ పరిమితి 25,000 రూపాయలు.