business

టాటా EV కార్లపై బంపర్ ఆఫర్ - 3 లక్షలు తగ్గింపు

టాటా EVలపై భారీ తగ్గింపులు

టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాలైన Nexon EV, Punch EV లపై 'ఫెస్టివల్ ఆఫ్ కార్స్' ఆఫర్ ద్వారా భారీ తగ్గింపులను అందిస్తోంది.

3 లక్షల వరకు తగ్గింపు ఆఫర్

'ఫెస్టివల్ ఆఫ్ కార్స్' ఆఫర్ కింద ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుపై గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది.

Tiago EVపై రూ.40,000 తగ్గింపు

టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ Tiago EV కారుపై 40,000 రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ కారు ప్రారంభ ధర ఇప్పుడు 7.99 లక్షలకు చేరుకుంది.

Tata Punch EVపై రూ.1.20 లక్షల తగ్గింపు

Tata Punch EVపై 1.20 లక్షల రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది టాటా. దీంతో ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర ఇప్పుడు 9.99 లక్షలకు చేరుకుంది. 

Nexon EVపై రూ.3 లక్షల వరకు తగ్గింపు

టాటా Nexon EVపై అత్యధికంగా 3 లక్షల రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ కారు ధర ఇప్పుడు 12.49 లక్షల రూపాయల నుండి ప్రారంభం అవుతుంది.

ఇతర కార్లపై కూడా తగ్గింపులు

అంతేకాకుండా, పండుగ సీజన్‌ను నేపథ్యంలో తన ప్యాసింజర్ వాహనాల ధరలను కూడా 2 లక్షల రూపాయల వరకు తగ్గించింది. ఈ ఆఫర్ పెట్రోల్-డీజిల్ వాహనాలపై ఉన్నాయి. 

పరిమిత కాల ఆఫర్

టాటా మోటార్స్ వాహనాలపై అందించే ఈ ఆఫర్ సెప్టెంబర్ 10 నుండి అక్టోబర్ 31, 2024 మధ్య కారు బుక్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. 

స్టీవ్ జాబ్స్ ఆ ఇ-మెయిల్ చూడకపోతే ఇప్పుడు మనచేతిలో ఐ-ఫోన్ ఉండేది కాదు

SIPలో ఇన్వెస్ట్ చేస్తున్నారా ఈ టిప్స్ పాటిస్తే రూ.5 కోట్లు మీ సొంతం

ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి పండ్ల ఎగుమతిదారు ఎవరో తెలుసా?

క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయడం ఎలా? ఆర్బిఐ నిబంధనలేంటి?