business

SIPలో ఇన్వెస్ట్ చేస్తున్నారా ఈ టిప్స్ పాటిస్తే రూ.5 కోట్లు మీ సొంతం

పదవీ విరమణ కోసం సరైన పెట్టుబడి

వృద్ధాప్యంలో డబ్బు కొరత రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఉద్యోగంలో ఉన్నప్పుడే పెట్టుబడి పెట్టాలి. పదవీ విరమణ సమయానికి ఎక్కువ డబ్బు పొందాలంటే సరైన చోట పెట్టుబడి పెట్టడం ముఖ్యం.

రెగ్యులర్ SIPతో రూ.5 కోట్లు పొందవచ్చు

ఒక వ్యక్తి SIPలో క్రమం తప్పకుండా డబ్బు పెడితే 30 సంవత్సరాలలో అతను తన కోసం 5 కోట్ల రూపాయల నిధిని సేకరించవచ్చు.

రూ.5 కోట్లు పొందడానికి ఎంత SIP చెయ్యాలి?

ఈ రోజు మొదలు ప్రతి నెలా రూ.15 వేలు SIP చేస్తే 30 సంవత్సరాల్లో 5 కోట్ల రూపాయలు పొందవచ్చు. 

SIPలో చక్రవడ్డీ ప్రయోజనం లభిస్తుంది

క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళిక వల్ల SIPలో చక్రవడ్డీ ప్రయోజనం కలుగుతుంది. SIPలో 15% కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. దీర్ఘకాలంలో కనీసం 12% వడ్డీ కింద లెక్కకట్టినా మంచి రిటన్స్ వస్తాయి. 

నెలకు రూ.15000 SIP చేస్తే 30 ఏళ్లలో ఎంత మొత్తం?

ఈ విధంగా ఒక వ్యక్తి ప్రతి నెలా 15000 రూపాయలు మంచి SIPలో 30 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే అతని మొత్తం రూ.54 లక్షలు అవుతుంది.

12% వడ్డీతో 30 ఏళ్ల తర్వాత రూ.5.29 కోట్లు

దీనిపై 12 శాతం రాబడిని పరిగణనలోకి తీసుకుంటే 30 సంవత్సరాల తర్వాత చక్రవడ్డీతో కలిపి రూ.4,75,48,707 లభిస్తాయి. అసలుతో కలిపి మీ మొత్తం 5,29,48,707 రూపాయలు అవుతుంది.

10 ఏళ్లలో రూ.35 లక్షలు, 20 ఏళ్లలో రూ.1.5 కోట్లు

ఈ ఫార్ములా ప్రకారం SIP చేస్తే 10 సంవత్సరాల తర్వాత రూ.35 లక్షలు, 20 సంవత్సరాల తర్వాత సుమారు రూ.1.5 కోట్లు, 30 సంవత్సరాలకు రూ. 5.29 కోట్లు మీ సొంతమవుతాయి. 

Find Next One