business

స్టీవ్ జాబ్స్ ఆ ఇ-మెయిల్ చూడకపోతే ఇప్పుడు మనచేతిలో ఐ-ఫోన్ ఉండేది కాదు

ఐఫోన్ 16 : 'ఇట్స్ గ్లోటైమ్

ఆపిల్ కంపెనీ తమ కొత్త ఐఫోన్ 16ని సెప్టెంబర్ 9న విడుదల చేసింది. 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్ లో తాజా ఐఫోన్ తో పాటు ఆపిల్ వాచ్ సిరీస్ 10 కూడా లాంచ్ చేస్తున్నారు.  

ఆపిల్ తయారు చేసిన మొదటి కంప్యూటర్

ఆపిల్ తయారు చేసిన మొదటి కంప్యూటర్ 1976, ఏప్రిల్ 1 న విడుదలైంది. దీనిలో CPU, మానిటర్ లేవు. 1978లో ఆపిల్ తయారు చేసిన రెండవ కంప్యూటర్ ప్రపంచాన్ని అబ్బురపరిచింది. 

ప్రజలకు ఎలా చేరాయి

స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ ఒక గ్యారేజీ నుండి కాంపాక్ట్ కంప్యూటర్లను తయారు చేసి విక్రయించడం ప్రారంభించారు. ప్రజలు వీటిని ఇళ్లు, ఆఫీసుల్లో సులభంగా వాడుకోవడం స్టార్ట్ చేశారు.

ఆపిల్ అమ్మకాలు 16 రెట్లు పెరిగాయి

ఆపిల్ ఎల్లప్పుడూ కొత్త ఆవిష్కరణలు చేస్తూనే ఉంది. దీని వల్ల కంపెనీకి లాభం కూడా చేకూరింది. 2 సంవత్సరాలలో 16 రెట్లు అమ్మకాలు పెరిగి 117 మిలియన్ డాలర్లకు చేరుకుంది.

మోటరోలా ఫోన్‌లో ఆపిల్ ఐట్యూన్స్

స్టీవ్ జాబ్స్, మోటరోలా ఎండీ జెండర్ స్నేహితులు. 2005 సెప్టెంబర్ 7న మోటరోలా Moto ROKR E1 విడుదలైంది. ఆపిల్ ఐట్యూన్స్ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్ ఇది.

ఆపిల్ ఫోన్ తీసుకురావాలని డిమాండ్

Moto ROKR E1 కి మంచి స్పందన రాలేదు. కానీ ఆపిల్ తన సొంత స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయాలనే డిమాండ్ పెరిగింది. అయితే స్టీవ్ జాబ్స్ మాత్రం కంప్యూటర్ వ్యాపారంపై దృష్టి పెట్టాలనుకున్నారు.

స్టీవ్ జాబ్స్ ఎందుకు ఐఫోన్ తీసుకురావాలనుకోలేదు

'ది వన్ డివైస్: ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ఐఫోన్' పుస్తకం ప్రకారం స్టీవ్ జాబ్స్ 'ఆపిల్ తన సొంత స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేస్తే దాని పరిధి పరిమితం అవుతుంది' అని భావించారట.

ఐఫోన్ కోసం స్టీవ్ జాబ్స్ ఇలా ఒప్పుకున్నారు

స్టీవ్ జాబ్స్ కి 2004 నవంబర్ 7న ఆపిల్ వైస్ ప్రెసిడెంట్ మైక్ బెల్ ఒక ఇ-మెయిల్ పంపారు. అందులో 'స్టీవ్, స్మార్ట్‌ఫోన్‌ల తయారీకి నా దగ్గర మంచి ఆలోచన ఉంది.' అని రాసుంది.

స్టీవ్ జాబ్స్ కి పంపిన ఇమెయిల్ లో ఏముంది

'డిజైనర్ జానీ ఐవ్ దగ్గర ఐప్యాడ్‌ల కోసం మంచి డిజైన్‌లు ఉన్నాయి, మనం మన సొంత ఫోన్‌ను తయారు చేయాలి' అని స్టీవ్‌కి మైక్ ఇ-మెయిల్‌ చేశారు.

 

ఐఫోన్ ప్రాజెక్ట్ ప్రారంభం

ఈ ఇ-మెయిల్ పంపిన 3, 4 రోజుల తర్వాత స్టీవ్ జాబ్స్, మైక్ బెల్, జానీ ఐవ్, స్టీవ్ ఇస్కోమాన్ లంచ్ కోసం కలుసుకున్నారు. అక్కడే ఐఫోన్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.

Find Next One