business
MBA నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు అధిక జీతం ఇచ్చే ఉద్యోగాలు పొందడంలో మీకు సహాయపడే అనేక కోర్సులు ఇక్కడ ఉన్నాయి.
కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందిన తర్వాత మీరు టాప్ కంపెనీల నుండి రూ.కోట్ల ప్యాకేజీని పొందవచ్చు.
IIM, ISB, FMS వంటి టాప్ బి-స్కూల్స్ నుండి MBA చేస్తే మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్, ఫైనాన్స్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ వంటి జాబ్స్ వస్తాయి. వీటికి రూ.కోట్ల ప్యాకేజీలు ఇస్తారు.
డేటా సైన్స్, అనలిటిక్స్‌లో నిపుణుడిగా మారితే పెద్ద కంపెనీలు మీకు అధిక జీతం ఇచ్చే ఉద్యోగాలను అందిస్తాయి. డేటా విశ్లేషణలో నైపుణ్యం మీకు సులభంగా అధిక ప్యాకేజీని పొందేలా చేస్తుంది.
AI, మెషిన్ లెర్నింగ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలు. వీటిల్లో నైపుణ్యం కలిగిన నిపుణులకు కోట్ల రూపాయల జీతాలు అందిస్తున్నాయి.
కంపెనీల, వ్యక్తిగత అకౌంట్ బాధ్యతలను నిర్వహించడానికి CA చాలా అవసరం. చార్టర్డ్ అకౌంటెంట్లకు పెద్ద కంపెనీలలో రూ.లక్షలు, రూ.కోట్ల ప్యాకేజీలు అందిస్తున్నారు.
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో ప్రత్యేకత కలిగి ఉండటం వల్ల టాప్ సంస్థల నుండి అధిక జీతం ప్యాకేజీలు లభిస్తాయి. బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్‌లో అనేక కెరీర్ అవకాశాలు ఉంటాయి.
ఈ కోర్సుల ద్వారా మీరు మీ నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకోవడమే కాకుండా మీ కెరీర్‌లో మంచి ప్యాకేజీతో బెటర్ భవిష్యత్తును కూడా పొందవచ్చు.