business

రతన్ టాటా అంత ఫేమస్ అవడానికి కారణాలు ఇవే

విజనరీ లీడర్

రతన్ టాటా గొప్ప విజనరీ ఉన్న లీడర్. అందుకే టాటా గ్రూప్‌ను స్టీల్ నుండి ఐటీ వరకు దిగ్గజ సంస్థగా తీర్చిదిద్దారు.

నిజాయతీపరుడు

నైతిక విలువలు, కార్పొరేట్ పాలన నిబంధనలకు రతన్ టాటా కట్టుబడి ఉన్నారు. ఉద్యోగులు, వాటాదారుల విశ్వాసాన్ని పొందారు.

వినయమే ఆభరణం

రతన్ టాటా సూపర్ సక్సెస్ ఫుల్ పర్సన్. అయినప్పటికీ ఆయన చాలా వినయంగా ఉండేవారు. విజయం వస్తే తన బృందానికి, అపజయాలు కలిగితే ఆయనే బాధ్యత తీసుకునేవారు.

సవాళ్లతో సావాసం

రతన్ టాటా క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడేవారు కాదు. సవాళ్లను ఎదుర్కొనేవారు.

కొత్త ఆలోచనలకు ప్రాధాన్యం

రతన్ టాటా ఎల్లప్పుడూ కొత్తగా ఆలోచించేవారు. టాటా నానో వంటి ప్రాజెక్టులు దీనికి ఉదాహరణ.

ఎంపవర్మెంట్ ముందుకు

ఉద్యోగులకు స్వేచ్ఛ, బాధ్యత ఇవ్వాలని రతన్ టాటా నమ్మేవారు. సాధికారత కల్పించి వారు భయం లేకుండా నిర్ణయాలు తీసుకునే వాతావరణాన్ని సృష్టించారు.

ఉద్యోగులతో కో ఆర్డినేషన్

సంస్థలో అన్ని స్థాయిలలో స్పష్టమైన కో ఆర్డినేషన్ ఉండేలా ప్రోత్సహించారు. దీని ద్వారా స్పష్టత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చారు.

డేరింగ్ క్యారెక్టర్

రతన్ టాటా రిస్క్‌లు తీసుకోవడానికి భయపడేవారు కాదు. టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయిలో విస్తరించడంలో ఆయన డేరింగ్ క్యారెక్టర్ కీలక పాత్ర పోషించింది.

సామాజిక బాధ్యత ఎక్కువ

సామాజిక ప్రభావానికి రతన్ టాటా ప్రాధాన్యత ఇచ్చేవారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సమాజ అభివృద్ధి ప్రాజెక్టులలో కూడా పెట్టుబడులు పెట్టారు.

అప్ డేట్ మ్యాన్

రతన్ టాటా ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉండేవారు. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, సవాళ్లకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకునేవారు.

Find Next One