Telugu

ఫ్రెండ్స్‌కి హెల్మెట్ ఇవ్వొద్దు... కారణమేంటో తెలుసా?

Telugu

ఫంగల్ ఇన్ఫెక్షన్

హెల్మెట్‌ లోపల వేడి, తేమ, చెమట ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఫంగస్ పెరిగేందుకు అవకాశం ఎక్కువ. ఇది తలపై తామర వంటి చర్మ వ్యాధులకు దారితీస్తుంది.

Image credits: Getty
Telugu

పేలు

మీ ఫ్రెండ్ తలలో పేలు ఉంటే, అవి హెల్మెట్ లోపలికి చేరతాయి. తర్వాత మీరు ఆ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు, ఆ పేలు మీ తలలోకి సులభంగా వచ్చేస్తాయి.

Image credits: Freepik
Telugu

చర్మ అలెర్జీలు

హెల్మెట్‌లో పేరుకుపోయిన చెమట, మురికి చర్మానికి తగిలినప్పుడు దద్దుర్లు, దురద వంటి అలెర్జీలు వస్తాయి.

Image credits: instagram
Telugu

చెడు వాసన

హెల్మెట్‌లో చెమట ఎక్కువగా చేరడం వల్ల దుర్వాసన వస్తుంది. ఆ హెల్మెట్‌ను మీరు వాడినప్పుడు, ఆ వాసన మీ జుట్టుకు కూడా పడుతుంది.

Image credits: Getty
Telugu

మొటిమలు

హెల్మెట్‌లో ఉండే బ్యాక్టీరియా వల్ల నుదుటిపై మొటిమలు, చిన్న చిన్న కురుపులు వంటి సమస్యలు వస్తాయి.

Image credits: Getty
Telugu

సైజ్ సరిపోకపోతే?

మీకు సరిపోని సైజ్ హెల్మెట్ ధరించడం వల్ల తలనొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు వస్తాయి. భద్రత కూడా తక్కువే.

Image credits: Getty
Telugu

మరి ఏం చేయాలి?

వీలైనంత వరకు ఇతరులతో హెల్మెట్ షేర్ చేసుకోవద్దు. ఒకవేళ తప్పనిసరి అయితే, లోపల యాంటీసెప్టిక్ స్ప్రే చేసి వాడండి. అలాగే, హెయిర్ కవర్ లేకుండా హెల్మెట్ పెట్టుకోవద్దు.

Image credits: Getty

ఇండియాలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఇదే.. ధర, ఫీచర్లు అదుర్స్!

Budget EV Cars : అత్యంత చౌక టాటా ఎలక్ట్రిక్ కారు ఏదో తెలుసా?

Petrol Saving : గురూ.. నీ పెట్రోల్ ఖర్చు తగ్గాలంటే ఈ ట్రిక్స్ ఫాలోకా..

కొత్త యాక్టివా 8G వచ్చేస్తోంది, ధర ఎంత?