పెట్రోల్ ధరలు పెరగడంతో సామాన్యుడి జేబుపై భారం పడుతోంది. ఆఫీస్, స్కూల్, ఇతర పనులకు వెళ్లాలంటే ఖర్చు తడిసి మోపెడవుతోంది. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవడానికి ఈ 10 చిట్కాలు పాటించండి.
చాలామంది ప్రతి 5 సెకన్లకు ఒకసారి గట్టిగా యాక్సిలరేటర్ ఇచ్చి, వెంటనే బ్రేకులు వేస్తుంటారు. దీనివల్ల పెట్రోల్ ఎక్కువగా కాలుతుంది. కాబట్టి బండిని స్మూత్‌గా నడపి పెట్రోల్ ఆదా చేయండి.
టైర్లలో గాలి తక్కువగా ఉంటే ఇంజిన్‌పై భారం పెరిగి పెట్రోల్ ఎక్కువ కాలుతుంది. అందుకే ప్రతి 10-15 రోజులకు ఒకసారి టైర్ ప్రెజర్ చెక్ చేయించండి. కంపెనీ సూచించిన మేరకే గాలి నింపండి.
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 20-30 సెకన్ల కంటే ఎక్కువ ఆగాల్సి వస్తే, ఇంజిన్ ఆఫ్ చేయండి. దీనివల్ల పెట్రోల్ సేవ్ అవుతుంది. అయితే కొత్త వాహనాల్లో ఆటో స్టార్ట్-స్టాప్ ఫీచర్ వస్తోంది.
కారు ఏసీ వల్ల పెట్రోల్ ఎక్కువ ఖర్చవుతుంది, ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో. అందుకే వాతావరణం చల్లగా ఉంటే కిటికీలు తెరుచుకోండి. ఏసీ టెంపరేచర్ మరీ తక్కువగా పెట్టకండి.
మురికి పట్టిన ఎయిర్ ఫిల్టర్, పాత ఇంజిన్ ఆయిల్, పాడైన స్పార్క్ ప్లగ్స్ మైలేజీని తగ్గిస్తాయి. గుర్తుంచుకోండి, రెగ్యులర్ సర్వీసింగ్ వల్ల మైలేజ్ మెరుగుపడుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది.
కారులో అనవసరమైన సామాన్లు నింపడం వల్ల బండి బరువెక్కి ఫ్యూయల్ ఎక్కువ కాలుతుంది. పాత బ్యాగులు, పనికిరాని టూల్స్, అదనపు సామాన్లను కారులోంచి తీసేయండి.
ఒకటి రెండు కిలోమీటర్ల కోసం బండి తీయడం వల్ల పెట్రోల్ బాగా వేస్ట్ అవుతుంది. అలాంటి చోట్లకు నడిచి వెళ్లడం, సైకిల్ వాడటం, లేదా షేర్ ఆటో, ఈ-రిక్షా ఎక్కడం మంచిది.
తప్పుడు గేర్‌లో బండి నడపడం వల్ల ఇంజిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే తక్కువ స్పీడ్‌లో హై గేర్ వేయకండి. ఎక్కువ స్పీడ్‌లో లో గేర్ వాడకండి. ఇలా చేయడం వల్ల మైలేజ్ మెరుగుపడుతుంది.
ఆఫీస్‌కు ఒకే రూట్‌లో 3-4 మంది వెళ్తుంటే, కార్ పూలింగ్ చాలా చవకైన మార్గం. దీనివల్ల ఫ్యూయల్ ఖర్చు పంచుకోవచ్చు, ట్రాఫిక్ తగ్గుతుంది, పార్కింగ్ టెన్షన్ కూడా ఉండదు.
ప్రతి పెట్రోల్ బంక్‌లో క్వాలిటీ, సర్వీస్ వేర్వేరుగా ఉండొచ్చు. అందుకే నమ్మకమైన బంక్‌ను ఎంచుకోండి. ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయ్యే వరకు నడపకండి. ఉదయాన్నే ఫ్యూయల్ నింపడం మంచిది.