Vastu Tips: ఇంట్లో ఏ దిశలో ఏది ఉంటే మంచిదో తెలుసా? ఇవి తెలుసుకోండి
astrology Jun 22 2025
Author: Rajesh K Image Credits:Pinterest
Telugu
మొక్కలు, నీరు, వెలుతురు
తులసి, మనీ ప్లాంట్, కలబంద వంటి మొక్కలు ఇంట్లో సానుకూల శక్తిని తెస్తాయి. ఇంట్లో సహజంగా వెలుతురు, గాలి ప్రసరించాాలి. లీకయ్యే కుళాయి, మూసిన కిటికీ వంటివి వాస్తు దోషానికి సంకేతాలు.
Image credits: Pinterest
Telugu
బ్రహ్మస్థానం
బ్రహ్మస్థానం అనేది వాస్తు శాస్త్రంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ఇంటి కేంద్ర స్థానాన్ని సూచిస్తుంది. ఇది శక్తి కేంద్రంగా పరిగణించబడుతుంది. బ్రహ్మస్థానం ఖాళీగా ఉండకూడదు.
Image credits: Pinterest
Telugu
నైరుతి దిశలో బెడ్ రూమ్
వాస్తు శాస్త్రం ప్రకారం.. మెయిన్ బెడ్ రూమ్ నైరుతి దిశలో ఉండాలి. నిద్రించేటప్పుడు తల దక్షిణం లేదా తూర్పు దిశలో ఉండాలి. ఉత్తరం వైపు తల పెట్టకూడదు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది
Image credits: Pinterest
Telugu
ఈశాన్యంలో టాయిలెట్
వాస్తు శాస్త్రం ప్రకారం.. టాయిలెట్ నైరుతి లేదా దక్షిణ దిశలో ఉండటం మంచిది. కానీ, ఈశాన్యంలో టాయిలెట్ ఉండటం వాస్తు దోషం, ఇది ఆరోగ్యం, సంపదపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
Image credits: Pinterest
Telugu
కిచెన్ వాస్తు ఇలా
వాస్తు ప్రకారం వంటగదిని ఇంటికి ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేసుకోవాలి. వంట సమయంలో తూర్పు దిశ ముఖంగా నిలబడి ఆహారం వండుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే ఇంట్లో సుఖ శాంతులు నెలకొంటాయి.
Image credits: Pinterest
Telugu
పూజ గది ఎక్కడ ?
పూజ గదిని ఇంటి ఈశాన్య భాగంలో ఉండటం శుభప్రదమని వాస్తు శాస్త్రం చెబుతోంది. టాయిలెట్ లేదా బెడ్ రూమ్ దగ్గర పూజ స్థలం ఉండకూడదు. దేవుడి విగ్రహాలను ఉత్తరం లేదా తూర్పు దిక్కున ఉంచాలి.
Image credits: Pinterest
Telugu
ప్రధాన ద్వారం దిశ
ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం, ఈశాన్యం లేదా తూర్పు దిశలో ఉండటం శుభప్రదమని వాస్తు శాస్త్రం చెబుతోంది. దక్షిణ దిశలో ద్వారం ఉంటే ప్రతికూల శక్తి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందని చెబుతారు