Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే.. ఊహించని ప్రయోజనాలు
astrology Jul 12 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
గాలి శుద్ధి
మనీ ప్లాంట్ గాలిలో ఉండే ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి విష పదార్థాలను తొలగించి గాలిని శుద్ధి చేస్తుంది. ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపర్చడటంలో సహజ ఎయిర్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది.
Image credits: Getty
Telugu
పెంచడం చాలా సులభం.
మనీ ప్లాంట్ తక్కువ సంరక్షణలోనే పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఇంట్లో లేదా ఆఫీసులో చాలా సులభంగా పెంచుకోవచ్చు. తక్కువ నీరు, తక్కువ సూర్యకాంతిలో పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
వృద్ధికి, అభివృద్ధికి చిహ్నం
మనీ ప్లాంట్ వృద్ధికి, అభివృద్ధికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇది ఇంట్లో ఉండటం శుభప్రదమని భావిస్తారు. ఇది మీ జీవితంలో సానుకూల మార్పులకు సూచనగా నిలుస్తుంది.
Image credits: Getty
Telugu
మానసిక ప్రశాంతత
మనీ ప్లాంట్ సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని భావిస్తారు. ఇంట్లో ఈ మొక్క ఉండటం వల్ల ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
Image credits: Getty
Telugu
ఇంటికి అందం
ఇంటిని అందంగా, ఆహ్లాదకరంగా మార్చుకోవాలని భావిస్తే మనీ ప్లాంట్ పెంచుకుంటే సరిపోతుంది. ఈ మొక్క ఇంటికి ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. ఏ గదిలోనైనా ఇది ఆకర్షణీయంగా కనిపిస్తుంది.