Asianet News TeluguAsianet News Telugu

అయ్యో పాపం.. అవార్డు అందుకున్న గంటలోనే ప్రభుత్వ ఉద్యోగి హఠాన్మరణం

ఉత్తమ ఉద్యోగిగా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న గంటలోనే ఓ ప్రభుత్వ ఉద్యోగి (The sudden death of a government employee within an hour of receiving the award in adilabad) మరణించారు. అవార్డు ప్రధానోత్సవం జరిగిన కొంత సమయానికి ఇంటికి వెళ్లిన ఆయన గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన చనిపోయారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.

A government employee died within an hour of receiving the award. The incident took place in Adilabad district. ISR
Author
First Published Jan 27, 2024, 11:11 AM IST | Last Updated Jan 27, 2024, 11:11 AM IST

ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి. పుట్టినప్పటి నుంచే అంగవైకల్యం ఉండటంతో ఆయన వీల్ చేర్ కే పరిమితమయ్యారు. ఆయన 2004లో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. తన వృత్తి ధర్మంలో నిస్వార్థంగా సేవలు అందించారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ ఉద్యోగిగా ఆయనను ఎంపిక చేసింది. కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న గంట తరువాత ఆ ఉద్యోగి ఆకస్మికంగా మరణించారు. 

ఎన్డీఏ కూటమికి నితీష్ కుమార్ ఖాయమే.. నేడు బీజేపీ కార్యవర్గ సమావేశం.. కానీ ట్విస్ట్ ఏంటంటే ?

కుటుంబం, బంధువుల్లోనే కాక జిల్లా స్థాయి అధికారుల్లో కూడా తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన ఆదిలాబాద్ లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ టౌన్ కు చెందిన 56 ఏళ్ల దివాకర్ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఆయన వికలాంగుడు కావడంతో వీల్ చైర్ పైనే ఉద్యోగానికి వెళ్లి వచ్చేవారు. 2014లో ఆయన ప్రభుత్వం ఉద్యోగం సంపాదించారు. 

దాదాపు 10 సంవత్సరాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే ఉద్యోగం నిర్వస్తున్నారు. అందుకే తన భార్య నాగలక్ష్మీ, ఇద్దరు కుమారులతో ఇక్కడ ఆదిలాబాద్ లోనే స్థిరపడ్డారు. ఓ కుమారుడు సాయి సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగం చేస్తుండగా.. మరో కుమారుడు గిరిధర్ ఇండియన్ ఆర్మీలో సేవలు అందిస్తున్నారు. కాగా.. దివాకర్ సేవలు గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ ఉద్యోగిగా ఆయనను ఎంపిక చేసింది. 

ఇండియా కూటమిలో ఉంటే నితీష్ కుమార్ ప్రధాని అయ్యేవారు - అఖిలేష్ యాదవ్

శుక్రవారం జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ఉత్తమ ఉద్యోగిగా ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా అవార్డును, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ పరేడ్ మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఆయన ఇంటికి చేరుకున్నారు. కొంత సమయానికే దివాకర్ కు గుండెపోటు వచ్చింది. 

Election 2024: ఎన్నికల భారతం.. 96 కోట్లమంది అర్హులే..!

దీంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం ఉద్యోగ వర్గాల్లో, జిల్లా వ్యాప్తంగా విషాదం నింపింది. ఆయన మృతదేహానికి జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్, కమిషనర్, ఇతర అధికారులు నివాళి అర్పించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios