దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా సెమీస్ కు వర్షం ముప్పు.. ! ఒక వేళ మ్యాచ్ రద్దయితే..!? 

By Rajesh Karampoori  |  First Published Nov 16, 2023, 1:30 PM IST

AUS vs SA Semi-Final: ప్రపంచ కప్ 2023లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా,ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ-ఫైనల్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనున్నది. ఈ మ్యాచ్‌పై వర్షం ముప్పు పొంచి ఉంటున్నట్టు  తెలుస్తోంది.  ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే.. నిబంధనల ప్రకారం ఏ జట్టు ఫైనల్‌కు చేరుతుంది? 


AUS vs SA Semi-Final: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది. తొలి సెమీఫైనల్ లో న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. ఇక నేడు రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా, పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ ఉత్కంఠ పోరుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదిక కానున్నది ఈ తరుణంలో కోల్‌కతా వాతావరణం ఎలా ఉంది. ఈ మ్యాచ్ కు ఏమైనా ఆటంకాలు తల్లెత్తే అవకాశాలు ఉన్నాయా? ఓ వేళ మ్యాచ్ ఆగిపోతే.. అనే అంచనాలు చర్చనీయంగా మారాయి. 

హోరాహోరీగా జరుగనున్న దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. వెదర్ రిపోర్టు ప్రకారం.. కోల్‌కతాలో గురువారం 50 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత 23 నుండి 26 డిగ్రీల మధ్య ఉండవచ్చు. రాత్రి ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గవచ్చట.  వర్షం అడ్డంకిగా మారనున్నదా? అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Latest Videos

undefined

మ్యాచ్ రద్దయితే.. 

ఇలాంటి పరిస్థితుల్లో వర్షం పడితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సెమీఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంచారు. అంటే.. రద్దైన మ్యాచ్ మరుసటి రోజు (నవంబర్ 17న) జరుగుతోంది. గెలిచిన జట్టు టీమిండియాతో ఫైనల్ లో తలపడుతోంది.  ఒక వేళ శుక్రవారం కూడా వర్షం కురిస్తే ఎలా అనుమానం రాకమానదు కొందరికీ. అలా రెండో రోజు కూడా వర్షం అడ్డంకిగా మారితే.. ఓవర్లను కుదిస్తారు. అంటే.. 20-20 ఓవర్ల మ్యాచ్‌ నిర్వహిస్తారు. ఈ మ్యాచ్ కూడా వర్షం అడ్డంకిగా మారితే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఫైనల్ లోకి వెళ్తుతుంది. ఇలా జరిగితే.. దక్షిణాఫ్రికా జట్టు లాభపడనుంది. ఆ జట్టు ఫైనల్ టీమిండియాతో గెలుపులో తలపడుతుంది.

click me!