Mohammed Shami: న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఏకంగా 7 వికెట్లు పడగొట్టి టీమిండియా ఫైనల్ లో అడుగుపెట్టడంలో కీ రోల్ ఫ్లే చేశారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు. దీంతో ఆయనపై పలువురు నుంచి ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఓ నెటిజన్ గతంలో పోస్ట్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటీ..? ఎందుకు ఆ పోస్టు వైరల్ గా మారింది ?
Mohammed Shami: ICC ODI ప్రపంచ కప్ 2023లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. అద్భుతంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్ల ఆటతీరు కూడా కనిపించింది.న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత టాప్ బౌలర్ మహ్మద్ షమీ 9.5 ఓవర్లలో 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టి మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. దీంతో పాటు ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లో అద్భుత రికార్డు కూడా నమోదు చేశాడు.
50 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్
undefined
ఈ టోర్నీలో రెండుసార్లు 5 వికెట్లు పడగొట్టడం ద్వారా మహమ్మద్ షమీ వన్డే ప్రపంచకప్‌లో తన 50 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. షమీ కేవలం 17 వన్డేల్లో బౌలింగ్ చేసి 51 వికెట్లు తీశాడు. దీంతో పాటు ప్రపంచకప్ వన్డేలో షమీ 5 వికెట్లు తీయడం ఇది నాలుగోసారి. అలాగే.. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మహ్మద్ షమీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
ఇలా తాను ఆడిన ప్రతి మ్యాచ్ ల్లో షమీ ఆధిపత్యం కొనసాగించడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ తరుణంలో @DonMateo_X14 అనే నెటిజన్.. సెమీ ఫైనల్‌లో షమీ 7 వికెట్లు పడగొట్టిన కల వచ్చిందని. నేడు ఆ అద్బుతమైన 'కల'నిజమైంది! కామెంట్ చేశారు. ఆ నెటిజన్ పోస్టును టార్గెట్ చేస్తూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరూ నువ్వు టైం ట్రావెల్ లో ప్రయాణించావా? అంటూ కామెంట్ చేయగా.. మరికొందరూ కప్ ఫైనల్ లో ఏ జట్టు గెలుస్తుంది బ్రో అంటూ కామెంట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే.. బ్రో నేను బిలియనీర్ కావాలని దయచేసి కలలు కనండి అంటూ చమత్కరించారు. ఏదిమైనా.. @DonMateo_X14 పోస్ట్ ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్ లో వైరల్‌గా మారింది.
Saw a dream where Shami took 7 wickets in the semi final ☠️
— Don Mateo (@DonMateo_X14)
నిజానికి..సెమీ-ఫైనల్స్‌లో న్యూజిలాండ్ ముందు భారత్ 397 పరుగుల భారీ స్కోరును ఉంచింది. మహ్మద్ షమీ ఆరంభంలో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ వెన్ను విరిచాడు. షమీ వరుసగా ఆరు,ఎనిమిదో ఓవర్లలో డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర వికెట్లను తీశాడు. దీని తర్వాత 33వ ఓవర్లో కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్‌లను పెవిలియన్‌కు పంపారు. ఆ తరువాత డారిల్ మిచెల్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్‌లను అవుట్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు.