Spiritual
దేవాలయంలో కొన్ని వస్తువులను దానం చేయడం మంచిదంటారు. అందులో కర్పూరం ఒకటి.
కర్పూరం దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
దేవాలయంలో కర్పూరం దానం చేస్తే పితృదోషం తొలగిపోతుందట. ఇంట్లోకి చెడు శక్తులు రావట.
కర్పూరంతోనే హారతి ఇస్తారు. కాబట్టి దేవాలయానికి కర్పూరం దానం చేస్తే జీవితంలో సమస్యలు తొలగిపోతాయట.
శుక్రవారం లక్ష్మీదేవి పాదాలకు ఎర్రని పువ్వులతో కర్పూరం కలిపి అర్చన చేస్తే డబ్బు వస్తుందని నమ్మకం.
దేవాలయంలో నీటిలో కర్పూరం వేసి ఆ నీటిని ఇంట్లో చల్లితే చెడు శక్తులు పోతాయని నమ్ముతారు.
దేవాలయంలో పూజా సామాగ్రితో కర్పూరం కలిపి దానం చేస్తే జాతకంలోని గ్రహదోషాలు తగ్గుతాయట.
రోజూ ఇంట్లో కర్పూరం వెలిగిస్తే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్మకం.