Spiritual
శ్రీరామ నవమి రోజున కొన్ని పనులు చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయట. అవేంటో చూద్దాం..
రామ నవమి శుభ సందర్భంగా శ్రీరాముడిని శాస్త్రోక్తంగా పూజించండి. శ్రీరాముడికి పసుపు వస్త్రాలు సమర్పించండి. పసుపు పువ్వులు పెట్టండి. కేసరి అన్నం నైవేద్యంగా పెట్టండి.
మీ జీవితంలో కొన్ని సమస్యలు ఉంటే, రామ నవమి శుభ సందర్భంగా శ్రీరాముడి మంత్రాలను తులసి మాలతో జపించండి. దీనివల్ల మీ సమస్యలు వాటంతట అవే దూరమవుతాయి.
రామ నవమికి అవసరమైన వారికి దానం చేయడం చాలా ముఖ్యం. ఈ రోజు మీరు ఏ వస్తువు దానం చేయాలనుకున్నా, ముందుగా శ్రీరాముడికి సమర్పించి, తర్వాత పేదలకు పంచండి.
శ్రీరాముడికి పసుపు రంగు మిఠాయి లేదా పండ్లను ముఖ్యంగా నైవేద్యంగా పెడతారు. లేదా మీరు కేసరి కలిపిన పాయసం లేదా హల్వాను కూడా రామ నవమికి దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు.
రామ నవమి సందర్భంగా సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం రెండు వైపులా దీపం వెలిగించండి. అంతేకాకుండా తులసి మొక్క కింద, ఇంటి పైకప్పు మీద, రావి చెట్టు మీద కూడా తప్పకుండా దీపం వెలిగించండి.