మీరు కోపంగా ఉన్నప్పుడు ముక్కు ద్వారా గాలి పీల్చుకుని నోటి ద్వారా నెమ్మదిగా వదలండి. ఇది మెదడుకు ఆక్సిజన్‌ను అందిస్తుంది. కోపాన్ని తగ్గిస్తుంది.
కోపంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు చల్లటి నీరు తాగండి. చల్లని నీరు శరీర ఉష్ణోగ్రతను, మనసును కూల్ చేస్తుంది.
కోపంలో మాట్లాడితే సంబంధాలు చెడిపోతాయి. కాబట్టి రెండు నిమిషాలు మౌనంగా ఉండండి. మౌనం మనసుకు ప్రశాంతతనిస్తుంది.
కోపంగా ఉన్న చోట ఉండకుండా వేరే చోటికి వెళ్ళండి. ఉదాహరణకు బయటకు వెళ్లి నడవండి.
కోపం తగ్గించుకోవడానికి ఫన్నీ వీడియోలు చూడండి. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, కోపం తగ్గుతుంది.
కోపంగా ఉన్నప్పుడు అద్దంలో మీతో మీరు మాట్లాడుకుని, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి.