pregnancy & parenting
పిల్లలకు ఇవ్వాల్సిన ముఖ్యమైన ఆహారం రాగులు. చాలా పోషకాలతో నిండి ఉండే ఈ రాగులను చాలా మంది పిల్లలు తినడానికి ఇష్టపడరు.
రాగిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, పళ్ళు దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నందున రాగులు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.
రాగుల్లోని అమైనో ఆమ్లాలు ముడతలను తగ్గించి చర్మం యవ్వనంగా ఉండటానికి సహాయపడతాయి.
రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.
రాగుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల అతిగా ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.