మీ పిల్లలను చదువు కోసం మొదటిసారి ఇంటి నుండి హాస్టల్ కి పంపుతున్నారా? తల్లిదండ్రులు వారికి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పించాలి.
పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ప్రయత్నించడానికి భయపడతారు. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే వారి భయం పోతుంది.
పిల్లలకు చిన్నప్పటి నుండే బాధ్యతలు నేర్పించాలి. ఇంట్లో ఉన్నప్పుడే చిన్న పనులు అప్పగిస్తే, బయటకు వెళ్లాక బాధ్యతగా పనులు చేయడం అలవాటు అవుతుంది.
ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు వివరించండి. ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలపండి. దీని వల్ల బయట వారు ధైర్యంగా పనులు చేయగలుగుతారు.
తప్పులు చేయడం సహజం. అయితే వాటి నుంచి పాఠాలు ఎలా నేర్చుకోవాలో వారికి వివరించండి.
ఒక్కొక్కరికీ ఒక్కో క్యారెక్టర్ ఉంటుంది. ఎవరి ఆలోచనల్లో వారు కరెక్ట్ అనుకుంటారు. అందువల్ల ఎవరినీ కించపరచకూడదని, గౌరవంగా చూడాలని పిల్లలకు నేర్పండి.
పిల్లలను కౌగిలించుకొని మాట్లాడటం వల్ల ఇన్ని ప్రయోజనాలా?
బ్రౌన్ రైస్ vs వైట్ రైస్: బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
మీ పిల్లలకు ఫ్రెండ్స్ లేరా? పేరెంట్స్ గా మీరు చేయాల్సింది ఇదే
చాణక్య నీతి ప్రకారం పిల్లల ముందు పేరెంట్స్ చేయకూడని పనులు ఇవే!