Lifestyle
రెండు వాల్‌నట్ తొక్కలను గుండ్రటి కార్డ్‌బోర్డ్‌పై ఇలా అతికించండి. కళ్ళు, నోరు, కాళ్లు, కొమ్ములు గీయడం ద్వారా రెయిన్ డీర్ తయారు చేయవచ్చు.
పిస్తా తిన్న తర్వాత తొక్కలు పారేయకుండా వాటికి రంగులు వేసి, నల్లటి కాగితంపై అతికించి ఇలా పువ్వుల డిజైన్ చేయండి.
పిస్తా తొక్కలను చతురస్రాకారపు బోర్డుపై ఇలా అతికించండి. మధ్యలో గుండ్రంగా, కిందకు వేలాడేలా పువ్వుల డిజైన్ వేయండి. దీన్ని మీ గోడకు అతికించుకోండి.
వాల్‌నట్ తొక్కలను తిరగేసి వాటికి కళ్ళు, నోరు పెట్టండి. చిన్న చెవులు, తోక చేసి పిల్లలు ఆడుకోవడానికి ఇలా క్యూట్ ఎలుకలను తయారు చేయండి.
పిస్తా తొక్కలకు నీలం రంగు వేసి నెమలి ఈకల డిజైన్ తయారు చేయండి. కాగితంపై నెమలి బొమ్మ గీసి, దాని ఈకల భాగంలో పిస్తా తొక్కలను అతికించండి.
కార్డ్‌బోర్డ్ సహాయంతో టెడ్డీ బేర్ షేప్ ని కత్తిరించండి. దానికి బ్రౌన్ కలర్ వేసి పొట్ట భాగంలో వాల్‌నట్ తొక్క పెట్టి క్యూట్ బొమ్మను తయారు చేయండి.
తెల్లటి కాగితంపై చెట్టు బొమ్మ గీసి, పిస్తా గుల్లలకు రంగులు వేసి రంగురంగుల పక్షులను తయారు చేయండి. వాటిని చెట్టు కొమ్మలపై ఉన్నట్లు అతికించండి. తర్వాత కళ్ళు, ముక్కు గీయండి.