Food
ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉండే పాలకూర సూప్ బరువు తగ్గాలనుకునే వాళ్లు మధ్యాహ్నం అన్నానికి బదులు తీసుకోవచ్చు.
వైట్ రైస్ కి బదులు ఫైబర్ ఎక్కువగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే బ్రోకోలీ రైస్ శరీరంలోని కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.
వైట్ రైస్ కి బదులు, క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే కాలీఫ్లవర్ రైస్ బరువు తగ్గాలనుకునే వాళ్లు మధ్యాహ్నం తినొచ్చు.
ఫైబర్ ఉండటం వల్ల ఎర్ర బియ్యం ఆకలిని నియంత్రిస్తుంది.
బియ్యం కంటే ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండేది బార్లీ. ఇది తొందరగా ఆకలిని తగ్గిస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఒక కప్పు ఓట్స్‌లో 7.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది, శరీర బరువును నియంత్రిస్తుంది.
ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల, ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల ఉప్మా తినడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.