Food
ప్రతిరోజూ ధనియాల నీరు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దామా..
ధనియాలలో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, థయామిన్, నియాసిన్, కెరోటిన్ వంటివి ఉన్నాయి.
ఫైబర్ అధికంగా ఉండే ధనియాలు వివిధ జీర్ణ సమస్యలను దూరం చేయడానికి, మలబద్ధకం నివారించడానికి సహాయపడతాయి.
ధనియాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా మంచివి.
జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, జుట్టు విరిగిపోకుండా ఉండటానికి ధనియాల్లోని పోషకాలు సహాయపడతాయి.
ధనియాల నీళ్లు క్రమం తప్పకుండా తాగడం వల్ల వివిధ కాలేయ వ్యాధులు నయమవుతాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ధనియాల నీళ్లు తాగడం వల్ల అధిక రక్తపోటును నియంత్రించవచ్చు.
ధనియాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఉదయం ధనియాల నీళ్లు తాగితే మెరిసే, మృదువైన చర్మం పొందవచ్చు.