Health

టమాటా, బెండకాయ, పాలకూర తింటే ఏమౌతుందో తెలుసా?

Image credits: Getty

క్యారెట్

క్యారెట్ మంచి హెల్తీ కూరగాయ. దీనిలో ఫైబర్, బీటా కెరోటిన్ లు పుష్కలంగా ఉంటాయి. మీరు గనుక క్యారెట్ ను తింటే మీ శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే బరువూ తగ్గుతారు. 

Image credits: Getty

టమాటా

టమాటా కూడా మీరు బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. టమాటాలో ఉండే లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty

పాలకూర

పాలకూర కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్న పాలకూరను మీ డైట్ లో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 

Image credits: Getty

బ్రోకలీ

బ్రోకలీలో ఫైబర్, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బ్రోకలీని మీ ఆహారంలో చేర్చుకుంటే కూడా బరువు, కొలెస్ట్రాల్ రెండూ తగ్గుతాయి. 

Image credits: Getty

బెండకాయ

బెండకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ కూరగాయను తిన్నా మీ శరీరంలో ఎక్కువగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు కూడా తగ్గుతారు. 

Image credits: Getty

బీట్రూట్

బీట్ రూట్ ను చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. బరువు కూడా తగ్గుతారు

Image credits: Getty

చిలగడదుంప

చిలగడదుంపల్లో బీటా కెరాటిన్, పీచు, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వీటిని తిన్నా మీ శరీరంలో పేరుకుపోయిన కొలెస్టాల్ కరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

Image credits: Getty

రోజూ బ్లాక్ కాఫీ తాగితే ఏమౌతుందో తెలుసా

చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం రాకూడదంటే ఏం చేయాలో తెలుసా

అసలు మూర్చ ఎందుకు వస్తుందో తెలుసా

వీటిని తింటే మీకు ఎలాంటి గుండె జబ్బులు రావు