Health
చాలా మంది బ్లాక్ టీ కంటే బ్లాక్ కాఫీనే బాగా ఇష్టపడతారు. కానీ బ్లాక్ కాఫీని ఎక్కువగా తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బ్లాక్ కాఫీని ఎక్కువగా తాగితే మీరు ఎన్నో జీర్ణ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
బ్లాక్ కాఫీలో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ రక్తపోటును అప్పటికప్పుడు బాగా పెంచుతుంది.
బ్లాక్ కాఫీని రెగ్యులర్ గా తాగితే నిద్రలేమి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మీకు ఇప్పటికే ఈ సమస్య ఉంటే బ్లాక్ కాఫీని తాగడం మానేయండి.
బ్లాక్ కాఫీని ప్రతిరోజూ తాగితే తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఇది రాత్రిళ్లు మీకు నిద్రలేకుండా చేస్తుంది.
బ్లాక్ కాఫీని ఎక్కువగా తాగితే ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎముకల బలం తగ్గుతుంది.
బ్లాక్ కాఫీలో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా తాగితే ఆందోళన, స్ట్రెస్ పెరుగుతాయి.
రోజుకు 200-400 మిల్లీగ్రాముల కెఫిన్ కంటె ఎక్కువ తీసుకోకూడదు.ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.