Health
మనకు తెలియకుండానే మనం ఎన్నో చెడు అలవాట్లను ఫాలో అవుతుంటాయి. వీటిని వెంటనే మానుకోకపోతే ఎన్నిసమస్యలు వస్తాయో చెప్పలేం. ఇంతకీ అవేం అలవాట్లంటే..
రోజులో మనం ఉదయం తినే బ్రేక్ ఫాస్టే ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఇది మనల్ని రోజంతా ఎనర్జిటిక్ గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని స్కిప్ చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
నీళ్లే మన శరీరాన్ని అన్ని విధాలా ఆరోగ్యంగా, ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలి. లేదంటే సమస్యలొస్తాయి.
కంటినిండా నిద్ర ఉంటే ఎలాంటి జబ్బులు రావు. కానీ ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, డయాబెటీస్, హైబీపీ, కిడ్నీ సమస్యలు వస్తాయి.
చాలా మంది ఉదయం నిద్రలేవగానే ఫోన్ నే ఫస్ట్ చూస్తుంటారు. ఏమేమి నోటిఫికేషన్స్ వచ్చాయని చెక్ చేస్తుంటారు. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
స్మోకింగ్ మీ ఆరోగ్యాన్ని ఎన్ని విధాలా దెబ్బతీస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనివల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు వస్తాయి.