Food
గుడ్డులో విటమిన్ బీ12, విటమిన్ డి, ఫోలిక్ యాసిడ్, సెలీనియం వంటి పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతుంటారు.
అయితే గుడ్డు విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. ఇలాంటి వాటిలో గుడ్డు తింటే వేడి అవుతుందని ఒకటి. ఇందులో నిజమెంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్డు వేడి స్వభావం కలిగిన ఆహారం అని నిపుణులు అంటున్నారు. దీన్ని తిన్న తర్వాత, మీ శరీరంలో కొంచెం వెచ్చదనం అనిపించవచ్చు.
వేసవిలో గుడ్డు తినడం మంచిది కాదని కొందరు భావిస్తుంటారు. కానీ ఇందులో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి భయం లేకుండా సమ్మర్‌లో గుడ్డు తినొచ్చు.
నూనె ఎక్కువగా ఉపయోగించే ఆమ్లెట్ రూపంలో కాకుండా ఉడకబెట్టిన గుడ్డును మాత్రమే తీసుకోవాలి. నూనె జీర్ణ సంబంధిత సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది.
సమ్మర్‌లో వేడికి కోడి గుడ్లు పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు చల్లటి ప్రదేశంలో స్టోర్ చేసుకోవాలి.
తరచూ డీహైడ్రేషన్, అసిడిటీ, కడుపుబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు సమ్మర్‌లో కోడి గుడ్డును వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలే పాటించాలి.