Food
ఫూల్ మఖానాలను ఫాక్స్ నట్స్ లేదా లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి.
ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి శక్తినిచ్చి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ మఖానాలు మంచివి. కానీ వయస్సును బట్టి ఎంత తినాలో తెలుసా?
మఖానాలను ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హానికరం.
ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. వయస్సును బట్టి ఎంత తినాలో తెలుసుకోవాలి.
3 ఏళ్ల పిల్లలకు రోజుకి 5 మఖానాలు ఇవ్వచ్చు. ఎక్కువ తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.
10 ఏళ్ల పిల్లలకు 15 మఖానాలు ఇవ్వచ్చు. ఈ వయస్సులో జీర్ణక్రియ బాగుంటుంది.
పెద్దవారు 15 నుండి 20 గ్రాముల మఖానాలు తినవచ్చు. శరీరతత్వాన్ని బట్టి మోతాదు మారవచ్చు.