Food
గుడ్డు ప్రోటీన్ కి మంచి మూలం. కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి మంచిది.
గుడ్లు తినడం చాలా తేలిక. వండడం సులభం. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడంతో చాలామంది తినరు.
నాటు గుడ్లు తినడం లేదా గుడ్డులో తెల్లసొన మాత్రమే తినడం ఆరోగ్యకరమని చాలామంది నమ్ముతారు. ఇది నిజమేనా?
తెల్ల, నాటు గుడ్లలో ప్రధాన తేడా రంగు. నాటు గుడ్లు లేత గోధుమ లేదా లేత తెలుపు రంగులో ఉంటాయి. పౌల్ట్రీ గుడ్లు తెల్లగా ఉంటాయి.
నాటు గుడ్లు.. తెల్ల గుడ్ల కన్నా ఆరోగ్యకరమని భావిస్తారు. అందుకే అవి ఖరీదు ఎక్కువ.
నాటు గుడ్లు కోళ్లు సహజంగా పెరుగుతాయి. వాటికి హార్మోన్లు, మందులు ఇవ్వరు. పౌల్ట్రీ కోళ్లకి మాత్రం ఇస్తారు.
పోషకాల పరంగా రెండింటిలోనూ 10-15% తేడా ఉంటుంది. నాటు గుడ్లు ఆరోగ్యకరం ఎందుకంటే వాటిలో హార్మోన్లు, రసాయనాలు ఉండవని భావిస్తారు.
తెల్ల గుడ్లు తినడం వల్ల వెంటనే దుష్ప్రభావం ఉండదు. కాకపోతే కాస్త తక్కువగా తింటే నష్టం ఉండదు.
ఎక్కువ తెల్ల గుడ్లు తింటే హార్మోన్ల అసమతుల్యత, వ్యాధులు రావొచ్చు.