ఉడికించిన మామిడికాయలో నిమ్మరసం, నల్ల ఉప్పు, చల్లటి నీళ్ళు కలపాలి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. ఎండ దెబ్బ నుండి కాపాడుతుంది.
తురిమిన మామిడికాయ, మసాలాలు కలిపి పరాఠాలో నింపి నెయ్యి వేసి కాల్చాలి. ఇది ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారం. ముఖ్యంగా పిల్లలకు బాగా నచ్చుతుంది.
ముక్కలు చేసిన మామిడికాయలో ఆవనూనె, ఆవాలు, సోంపు, మెంతులు, పసుపు కలిపి పచ్చడి చేయాలి. ఇది ఏడాది పొడవునా నిల్వ ఉంటుంది. ఆవకాయ టేస్టే వేరు. ఇమ్యూనిటీని పెంచుతుంది.
తురిమిన పచ్చి మామిడికాయను బెల్లం, సోంపు, మెంతులు, పసుపు వేసి ఉడికించాలి. ఈ కూర కారం, తీపి రెండూ కలిసి ఉంటుంది. వేసవిలో ఆకలిని పెంచుతుంది.
పచ్చి మామిడికాయను కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర, సైంధవ లవణంతో రుబ్బాలి. పరాఠా లేదా దాల్ అన్నంతో ఈ చట్నీ తింటే అద్భుతమైన రుచినిస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
పచ్చి మామిడికాయను ఉడికించి గుజ్జు తీయాలి. దానిలో పుదీనా, వేయించిన జీలకర్ర, నల్ల ఉప్పు, బెల్లం కలిపి చల్లని పానీయం చేయాలి. ఇది ఎండ దెబ్బ నుండి రక్షిస్తుంది.