Food
ఒక్క డయాబెటీస్ ఉన్నవారే కాదు థైరాయిడ్ ఉన్నవారు కూడా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏవిపడితే అవి తింటే మీ జీవక్రియ నెమ్మదిస్తుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల ఫుడ్స్ మన థైరాయిడ్ పనితీరును ప్రభావితం చేస్తాయి. అందుకే థైరాయిడ్ ఉంటే ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
థైరాయిడ్ ఉన్నవారు క్యాబేజీ, బ్రోకలీని అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇది థైరాయిడ్ సమస్యను మరింత పెంచుతుంది.
థైరాయిడ్ పేషెంట్లు కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పానీయాలను తాగకూడదు. ముఖ్యంగా థైరాయిడ్ మందులు వాడుతున్నవారు కెఫిన్ ను తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
థైరాయిడ్ ఉండే సోయాబీన్స్, సోయా పాలు, సోయా చంక్స్, టోఫు వంటివి అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి థైరాయిడ్ సమస్యను మరింత పెంచుతాయి.
మిల్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ థైరాయిడ్ ఉన్నవారు మాత్రం తినకూడదు. వీటిలో థైరాయిడ్ సమస్యను పెంచే ఐసోఫ్లేవోన్స్ అనే సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది.
ప్రాసెస్ చేసిన ఆహారాలు చాలా టేస్టీగా ఉంటాయి. కానీ వీటిలో థైరాయిడ్ హార్మోన్లను ప్రభావితం చేసే సమ్మేళనాలు ఉంటాయి. వీటిని తింటే మీ జీవక్రియ నెమ్మదిస్తుంది.