Lifestyle
వామును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది.
వాముతో శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులను దరిచేరనివ్వకుండా కాపాడుతుంది.
రక్తపోటును తగ్గించడంలో కూడా వాము కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడకుండా చేస్తుంది.
జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేయడంలో కూడా వాము పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో వాము వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
వాములో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రో బయల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ సంబంధిత సమస్యలను కూడా వాము తగ్గిస్తుంది. తిన్న వెంటనే చిటికెడు వామును నమిలితే అజీర్ణం, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
అందాన్ని కాపాడడంలో కూడా వాము ఉపయోపడుతుంది. వాము పొడిలో కొద్దిగా నీరు కలిపి పేస్టులా చేసుకొని ముఖానికి అప్లై చేసుకుంటే మొటిమలు, మచ్చలు దూరమవుతాయి.
ఈ అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.