జీడిపప్పును ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మలబద్ధకం వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మోతాదుకు మించి తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
జీడిపప్పులో ఎక్కువగా ఉండే క్యాలరీలు ఊబకాయం సమస్యకు దారి తీసే అవకాశం ఉంటుంది. బరువు పెరగడానికి దారి తీస్తుంది.
ఇక షుగర్ పేషెంట్స్‌కి కూడా జీడిపప్పు అంత మంచిదికాదని నిపుణులు అంటున్నారు. ఇందులోని క్యాలరీలు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతాయి.
జీడిపప్పులో అధికంగా ఉండే మెగ్నీషియం, కాల్షియం కిడ్నీల్లో రాళ్ల సమస్యకు దారి తీసే అవకాశం ఉంటుంది. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు మితంగా తీసుకోవాలి.
చర్మ సంబంధిత అలర్జీలతో బాధపడేవారు జీడిపప్పును వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
చాణక్య నీతి ప్రకారం.. అదృష్టవంతులకు మాత్రమే దక్కే సుఖాలు ఇవి
మీ ఇంట్లో వాము ఉందా.? ఒంటిలో ఆరోగ్యం ఉన్నట్లే..
టమాటా, ఉల్లితో పోటీపడుతున్న చిక్కుడు... ధర ఎంతో తెలుసా?
ఇవి తింటేనే మలబద్దకం సమస్య వస్తుంది