Lifestyle
గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో చుక్కకూర బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని గుణాలు రక్త నాళాల్లో పూడికలు లేకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
రక్తపోటుతో బాధపడేవారు కచ్చితంగా చుక్కకూరను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా తీసుకుంటే రక్తనాళాలు వ్యాకోచం చెంది, బీపీ అదుపులో ఉంటుంది.
క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టడంలో కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, సర్విక్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది.
చుక్కకూరలో ఉండే మంచి గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతాయి. దీంతో తరచూ వచ్చే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. వైరస్, ఇన్ఫెక్షన్ల నుంచి తప్పించుకోవచ్చు.
రక్త హీనతతో బాధపడేవారికి కూడా చుక్కకూర బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో పుష్కలంగా ఉండే ఐరెన్ కంటెంట్ రక్తహీనతకు చెక్ పెడుతుంది.
గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా చుక్కకూర ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా వారంలో రెండు, మూడు సార్లు చుక్కకూరను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.