business
టాటా మోటార్స్ కు చెందిన అన్ని వాహనాల ధరలు 2% వరకు పెరుగుతాయి. కారు తయారీ ముడి పదార్థాల ధరల పెరుగుదలను భర్తీ చేయడానికి రేట్లు పెంచారు.
మారుతి సుజుకి కార్ల ధరలు కూడా ఏప్రిల్ 1, 2025 నుండి 4% వరకు పెరుగుతాయి. కార్ల తయారీ ముడి పదార్థాల ధరల పెరుగుదల, నిర్వహణ ఖర్చుల కారణంగా కంపెనీ కార్ల ధరలను పెంచింది.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా ఏప్రిల్ 1 నుండి తన SUV, CV రకాల ధరలను పెంచుతోంది. 3% వరకు ధరల పెరుగుదల ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
హ్యుందాయ్ కార్ల ధరలు కూడా వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుండి 3 శాతం వరకు పెరుగుతాయని అంటున్నారు.
హోండా కూడా ఏప్రిల్ 1 నుండి కార్ల ధరలను పెంచనుంది. అయితే కంపెనీ ధరలలో ఎంత పెరుగుదల ఉంటుందో తెలియజేయలేదు.
కియా కార్ల ధరలు కూడా ఏప్రిల్ 1 నుండి 30% వరకు పెరుగుతాయి. వస్తువుల ధరల పెరుగుదల, సరఫరా గొలుసు సంబంధిత ఖర్చులు పెరగడం వల్ల అన్ని కార్ల ధరలు పెంచారు.
రెనాల్ట్ ఇండియా ఏప్రిల్ 2025 నుండి అన్ని మోడళ్ల ధరలు 2 శాతం వరకు పెరుగుతాయని ప్రకటించింది. అయితే, ఇది మోడల్, వేరియంట్‌కు అనుగుణంగా మారుతుంది.