business
ఎన్విరాన్‌మెంట్ గురించి అవేర్‌నెస్ పెరగడంతో పేపర్ బ్యాగ్స్‌కి డిమాండ్ బాగా పెరిగింది. రూ.500తో బ్రౌన్ పేపర్, గ్లూ, రిబ్బన్ కొని స్టార్ట్ చేయొచ్చు. షాపులు, బొటిక్స్‌లో అమ్మొచ్చు.
పండగలకి, స్పెషల్ డేస్‌కి రాఖీలు, గ్రీటింగ్ కార్డ్స్ కి డిమాండ్ ఉంటుంది. రూ.500తో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సామాన్లు కొని వీటిని తయారు చేయొచ్చు. ఆన్ లైన్‌లో ఆర్డర్లు తీసుకోండి.
శనగపిండి, ముల్తానీ మట్టి, పసుపు లాంటి వాటితో ఫేస్ ప్యాక్స్ రెడీ చెయ్యండి. రూ.500తో 10–15 ప్యాక్స్ చెయ్యొచ్చు. లోకల్‌గా అమ్మేయొచ్చు. అయితే ప్యాకింగ్ మీద కాస్త శ్రద్ధ పెట్టాలి.
ఫెస్టివల్స్, పూజలు, గిఫ్టింగ్స్‌లో క్యాండిల్స్‌కి చాలా డిమాండ్ ఉంటుంది. రూ.500తో మైనం, అచ్చులు, రంగులు కొని వీటిని తయారు చేయొచ్చు. ఆన్‌లైన్‌లో, లోకల్ మార్కెట్‌లో అమ్మేయొచ్చు.
ఇది ట్రెండింగ్ బిజినెస్. సోషల్ మీడియాలో బాగా పాపులర్. రూ.500తో బేసిక్ రెజిన్ కిట్ కొని కీ-చైన్స్ చెయ్యండి. ఇన్స్టా రీల్స్ చేసి ఆర్డర్లు కూడా తెచ్చుకోవచ్చు.
సింపుల్ జూట్ బ్యాగ్‌ని మిర్రర్ వర్క్, కలర్ లేదా ఫాబ్రిక్ పెయింట్‌తో డెకరేట్ చెయ్యొచ్చు. రూ.500తో డెకరేటివ్ మెటీరియల్ కొని వీటిని తయారు చేసి లోకల్ బొటిక్స్‌తో టై-అప్ అయి అమ్మేయండి.
ఇంట్లోని పాత బాటిల్స్, డబ్బాలు, పేపర్లతో డెకరేషన్ ఐటమ్స్ తయారు చెయ్యండి. రూ.500తో గమ్, రంగులు, డెకరేషన్ సామాన్లు కొని క్రాఫ్ట్స్ చేయండి. చాలామంది గిఫ్టింగ్ కోసం వీటిని కొంటారు.
ఇంటి రుచికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. రూ.500తో నిమ్మ, మామిడి, ఉసిరి వంటి ఊరగాయ పచ్చళ్లు చెయ్యొచ్చు. చిన్న ప్యాకింగ్స్ చేసి మార్కెటింగ్ చెయ్యండి.
రూ.500-1000తో ఈ బిజినెస్‌లను జస్ట్ స్టార్ట్ చేయొచ్చు. కాని ఎక్కువ లాభం రావాలంటే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి.