business
ఇండియా ఇప్పుడు సముద్ర సేతు నిర్మాణంలో ఒక కొత్త చరిత్ర సృష్టించబోతోంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో కొత్త పాంబన్ బ్రిడ్జ్ ని నిర్మించింది.
ఈ బ్రిడ్జ్ 2.07 కి.మీ పొడవు ఉంది. ఇది రామేశ్వరం దీవిని సముద్రం ఒడ్డున ఉన్న ప్రధాన భూభాగంతో కలుపుతుంది.
గంటకు 80 కి.మీ. వేగంతో రైళ్లు వెళ్ళేలా ఈ బ్రిడ్జ్ ను డిజైన్ చేశారు. ఇది 100 ఏళ్ల వరకు ఉంటుందట.
ఇది డబుల్ రైల్వే లైన్ కోసం అనుకూలమైన సబ్-స్ట్రక్చర్. దీనికి తుప్పు పట్టకుండా కోటింగ్ వేశారు.
ఇది వెల్డెడ్ జాయింట్స్, హై-గ్రేడ్ పెయింటింగ్ టెక్నాలజీతో నిర్మించారు. ఆటో లాంచింగ్ టెక్నాలజీ వాడారు. అంటే దానికదే పైకి లేస్తుంది.
పెద్ద నౌకలు ప్రయాణించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జ్ ను నిర్మించారు. పెద్ద నౌక వచ్చినప్పుడు దానికదే పైకి లేస్తుంది.
1914లో పాత పాంబన్ బ్రిడ్జ్‌ను బ్రిటిష్ ఇంజనీర్లు డిజైన్ చేశారు. దీన్ని 81 డిగ్రీల వరకు పైకి ఎత్తవచ్చు.
పాత పాంబన్ బ్రిడ్జ్‌ను భద్రతా కారణాల దృష్ట్యా మూసివేశారు. ఇది దేశ అభివృద్ధికి చిహ్నం.
100 ఏళ్లు ఉండే ఈ బ్రిడ్జ్‌ను RVNL నిర్మించింది. IIT మద్రాస్ దీని టెక్నాలజీని ధృవీకరించింది.