విజయవాడ వాంబే కాలనీలో యువకుడి దారుణ హత్య

Published : Aug 24, 2020, 10:29 AM IST
విజయవాడ వాంబే కాలనీలో యువకుడి దారుణ హత్య

సారాంశం

విజయవాడలోని వాంబే కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తెల్లవారు జామున రోడ్డు మీదికి వచ్చిన సమయంలో ఈ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఓ దారుణమైన హత్య జరిగింది. విజయవాడలోని వాంబే కాలనీ సీ బ్లాక్ లో యువకుడిని దారుణంగా హత్య చేశారు. స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం కారణంగానే యువకుడు హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. 

తెల్లవారు జామున రోడ్డు మీదికి వచ్చిన సమయంలో ఈ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వివరాలను సేకరిస్తోంది. 

మృతుడిని వేముల రామకృష్ణ (34)గా పోలీసులు గుర్తించారు. విజయవాడలోని నున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలో ముఠాల మధ్య పెరిగిన విభేదాలు కూడా ఈ హత్యకు కారణమైన ఉండవచ్చునని అనుకుంటున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌