జగన్ డిల్లీ పర్యటన... రాష్ట్రం కోసమా...? కేసుల కోసమా...?: టిడిపి ఎంపీ సెటైర్లు

By Arun Kumar PFirst Published Oct 22, 2019, 4:30 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిల్లీ పర్యటనపై టిడిపి ఎంపీ సెటైర్లు విసిరారు. ఈ పర్యటన రాష్ట్రాభివృద్దికోసమే... తనపై వున్న కేసుల కోసమో... జగన్ కు అయినా క్లారిటీ వుందా అని అని ప్రశ్నించారు.  

విజయవాడ: ఐదు నెలలుగా జగన్ పాలన‌ అంతా ఓ రాక్షస పాలనలా వుందని తెలుగుదేశంఎంపీ కేశినేని నాని విమర్శించారు. కేవలం ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి వేధించడానికే ఈ కాలాన్ని వినియోగించారని అన్నారు. ప్రజాసమస్యలను గాలికొదిలేసి టిడిపి నేతలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టి‌ వేధిస్తున్నారని ఎంపీ ఆరోపించారు.

సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల ఎందువల్ల చనిపోయారో అందరికి తెలుసుకదా...? ప్రభుత్వ వేధింపులను తట్టుకోలేకే ఆయన ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలారని తెలిపారు. 

ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించేందుకు నిర్మించిన ప్రజా‌వేదికను కూలగొట్టి జగన్ పాలనను ప్రారంభించారని ఎద్దేవా చేశారు. ఆ తర్వాత కేవలం రౌడీయిజం, రాక్షసత్వం ఫ్యాక్షనిజం ఇదే ఎపిలో నడుస్తోందన్నారు.

యూనివర్సిటీల్లో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది మేధావులుగా విదేశాలలో ఖ్యాతి గడించేలా చేస్తున్నారు అద్యాపకులు. అలాంటివారిని తయారుచేసిన అధ్యాపకులను అక్రమంగా అరెస్టు చేయిస్తారా..? అంటూ ప్రశ్నించారు.

జగన్ ప్రభుత్వం లో జరుగుతున్న అరాచకాలను ఆధారాలతో గవర్నర్ కు‌వివరించామని తెలిపారు. వందలాది మంది‌ వైసిపి మద్దతుదారులతో దాడులు చేయిస్తారా...?  నిజాయితీ తో ఉన్న అధికారులు ,అధ్యాపకుల పై తప్పుడు కేసులు పెడుతున్నారా...? అంటూ ప్రశ్నించారు.

ఎన్జీ రంగా వ్యవసాయం విశ్వవిద్యాయల విసి పై  ఉద్దేశ పూర్వకంగా కేసె పెట్టిన జగన్ ప్రభుత్వం నేడు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఆయనను అక్రమంగా కేసులో ఇరికించి అరెస్ట్ చేశారన్న విషయం అందరికీ అర్ధం అవుతోందన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఘోరాలు, నేరాలను వైసిపి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ఈ అరాచక పాలనవల్ల అన్ని విధాలుగా ఎపి రాష్ట్రం, ప్రజలు నష్టపోతున్నారని అన్నారు.  

గత ప్రభుత్వ హయాంలో వేగంగా ముందుకు సాగిన రాష్ట్రం ఇప్పుడు వెనక్కి‌ వెళ్లిపోతోందన్నారు. విసి అరెస్ట్ పై కేవలం పత్రికల ద్వారానే తనకు కూడా సమాచారం ఉందని గవర్నర్ చెప్పారన్నారు. అన్ని విషయాల పై విచారణ చేపిస్తానని హామీ ఇచ్చారని నాని తెలిపారు.

 ప్రస్తుతం విద్యా వ్యవస్థ ను విచ్చిన్నం‌ చేసేలా జగన్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ డిల్లీ పర్యటన రాష్ట్ర అభివృద్ధి కోసమా...? తన కేసుల కోసమా...? అని  ప్రశ్నించారు. టిడిపి హయాంలో జరిగిన కట్టడాలను కూల్చడం మినహా జగన్ చేపట్టిన నిర్మాణాలు ఒక్కటి కూడా లేవని ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై ఎంపీ నాని ద్వజమెత్తారు. 


 

click me!