తనపై మాచర్లలో జరిగిన దాడిపై టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా స్పందించారు. తమను అంతమొందించడానికే ఈ దాడి జరిగిందంటూ సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు.
గుంటూరు: స్థానికసంస్థల ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను మరోసారి వేడెక్కించాయి. ఎంపిటీసి, జడ్పీటిసి ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే నామినేషన్ పర్వానికి చివరిరోజయిన నిన్న(బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అధికార, విపక్ష వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. గుంటూరు జిల్లా మాచర్లలో అయితే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలపై బౌతికదాడులు కూడా జరిగాయి.
అయితే ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన బుద్దా వెంకన్న సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు. ప్రత్యర్థుల దాడిలో తన శరీరంపై అయిన గాయాలతో కూడిన ఫోటోను పోస్ట్ చేసిన బుద్దా ప్రాణహాని వుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తమను అంతమొందించడానికే ఈ భయానక దాడికి పాల్పడినట్లు ఆయన ఆరోపించారు.
undefined
read more నేడు జగన్‌తో భేటీ కానున్న కరణం బలరాం: వైసీపీలోకి కరణం కుటుంబం
''స్వార్ధ రాజకీయం కోసం సొంత బాబాయ్ నే వేసేసారు. వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాడుతున్న ఒక సామాన్య బీసీ నాయకుడైన నన్ను వదులుతారు అని నేను అనుకోవడం లేదు'' అంటూ బుద్దా సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు.
''ప్రాణం ఉన్నంత వరకూ మా అధినేత చంద్రబాబు గారి వెంట ఉంటా. టీడీపీ నేర్పిన విలువలు, విధానాలకు కట్టుబడి నియంతపై నా పోరాటాన్ని కొనసాగిస్తా. ప్రజల మేలు కోసం ఈ పోరాటంలో నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం'' అని టిడిపిపై, పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై తనకున్న అభిమానాన్ని బుద్దా వెంకన్న ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు.
స్వార్ధ రాజకీయం కోసం సొంత బాబాయ్ నే వేసేసారు. వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాడుతున్న ఒక సామాన్య బీసీ నాయకుడైన నన్ను వదులుతారు అని నేను అనుకోవడం లేదు. (1/2) pic.twitter.com/Uc5UzNWD7k
— venkanna_budda (@BuddaVenkanna)