దారుణం:అన్న కుమార్తెని భవనం నుంచి కింద పడేసిన తమ్ముడు

Published : Nov 18, 2019, 01:53 PM ISTUpdated : Nov 18, 2019, 02:41 PM IST
దారుణం:అన్న కుమార్తెని భవనం నుంచి కింద పడేసిన తమ్ముడు

సారాంశం

రాను రాను కుటుంబ బాంధవ్యాలు మంటగలసిపోతున్నాయి. అన్న దమ్ములిద్దరూ గొడవపడింది చాలక చిన్నారిని బలిచేసే ప్రయత్నం చేశారు.

రాను రాను కుటుంబ బాంధవ్యాలు మంటగలసిపోతున్నాయి. అన్న దమ్ములిద్దరూ గొడవపడింది చాలక చిన్నారిని బలిచేసే ప్రయత్నం చేశారు. ఈ దారుణమైన సంఘటన విజయవాడలోని వాంబే కాలనిలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే విజయవాడ వాంబే కాలనిలో కృష్ణ, యేసు అనే అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. అన్నదమ్ముల మధ్య మొదలైన గొడవ తీవ్రపరిణామాలు దారి తీసింది. అనుకోకుండా అన్నదమ్ములు యేసు, కృష్ణ ఇద్దరూ ఘర్షణకు దిగారు. 

కృష్ణ తన సోదరుడు యేసుపై కోపంతో రగిలిపోయాడు. అతడిపై కోపాన్ని అభం శుభం తెలియని చిన్నారి యేసు కుమార్తెపై చూపించాడు. చిన్నారి జానకి వయసు ఆరేళ్ళు. జానకిని యేసు రెండు అంతస్తుల భవనం నుంచి కిందపడేశాడు. దీనితో జానకికి తీవ్రగాయాలు అయ్యాయి. 

జానకిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జానకి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణ చేసిన ఈ దారుణమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. చిన్నారిపై ఇంత దారుణానికి ఒడిగడతాడా అని అక్కడి స్థానికులు మండిపడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌