గొడ్ల చావిడిలో పేలుడు: మరోసారి ఉలిక్కిపడ్డ వేకనూరు

By telugu teamFirst Published Aug 1, 2020, 10:41 AM IST
Highlights

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలోని వేకనూరు గ్రామంలో పేలుడు సంభవించింది. ఆరు కిలోమిటర్ల మేర పేలుడు శబ్దం వినిపించింది. వేకనూరుకు ఫ్యాక్షన్ గ్రామం అనే పేరుంది.

అవనిగడ్డ: కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామంలో భారీ శబ్దం చోటు చేసుకుంది. తుంగల దిలీప్ అనే వ్యక్తి గొడ్లచావిడిలో పేలుడు సంభవించడంతో పెద్ద పెట్టున శబ్దం చోటు చేసుకుంది. దాన్ని పోలీసులు బాంబు పేలుడుగా అనుమానిస్తున్నారు.

పేలుడు శబ్దం  6కిలో మీటర్ల వరకు వినిపించింది.ఫ్యాక్షన్ విలేజ్ గా వేకనూరు గ్రామానికి పేరు ఉంది. 1989-1990 మధ్య కాంగ్రెస్ - టిడిపిల మధ్య ఫ్యాక్షన్ హత్యలు చోటు చేసుకున్నాయి. 

గ్రామంలో బాంబులు తయారు చేస్తారని ప్రచారం ఉంది. తుంగల దిలీప్ ఇంటికి చేరుకుని పోలీసులు పేలుడు ఘటనపై విచారిస్తున్నారు. దిలీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

click me!