పోలీస్ పహారాలో సింగరేణి నిర్వాసితుల ఇళ్ల కూల్చివేత... పెద్దపల్లి జిల్లాలో ఉద్రిక్తత

పోలీస్ పహారాలో సింగరేణి నిర్వాసితుల ఇళ్ల కూల్చివేత... పెద్దపల్లి జిల్లాలో ఉద్రిక్తత

Published : May 27, 2022, 11:45 AM IST

పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం లద్నపూర్ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం లద్నపూర్ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓసిపీ 2 విస్తరణలో భాగంగా లద్నపూర్ గ్రామాన్ని సింగరేణి అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున పోలీస్ బందోబస్తు, జేసిబిలతో సింగరేణి అధికారులు లద్నాపూర్ చేరుకుని ఇళ్ల కూల్చివేత ప్రారంభించారు.  ఓసీపీ 2 పక్కన ఉన్న ఇళ్లలోని వారిని బలవంతంగా బయటకు తీసుకువచ్చి సామాగ్రి వుండగానే కూల్చివేత చేపట్టారు. 

 తమ ఇళ్ల కూల్చివేతలను నిరసిస్తూ బాధితులు ఓసీపీ2 గేట్ ముందు ధర్నా చేపట్టారు. సింగరేణి ఉద్యోగులు మైన్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఓసీపీ 2 క్వారీలోకి చొచ్చుకువెళ్లేందుకు నిర్వాసితులు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులను తోసుకుంటూ కొందరు క్వారీలోకి వెళ్ళి నిరసన తెలిపారు. నిర్వాసితులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

05:51క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవంలో వెంకయ్య నాయుడు పవర్ ఫుల్ స్పీచ్ | Venkaiah Naidu Powerful Speech
17:28నేను సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు హార్డ్‌వేర్ కూడా.. రేవంత్ రెడ్డి KTR స్ట్రాంగ్ కౌంటర్ | Asianet Telugu
02:44సంధ్య థియేటర్ కేసు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్ | Asianet News Telugu
03:17Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
22:19CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
14:43Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్
21:44CM Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో విద్యార్థులకుసీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్| Asianet Telugu
10:42మీరు నా గుండె చప్పుడు జనసేన తెలంగాణ కార్యాలయ ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ | Asianet News Telugu
11:58JanaSena Telangana New State: హైదరాబాద్ మణికొండలో జనసేన తెలంగాణ నూతనరాష్ట్ర కార్యాలయం ప్రారంభం
02:08Pawan Kalyan మీద దేశద్రోహం కేసు పెట్టాలి: Kalvakuntla Kavitha | Asianet News Telugu