సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులతో 'ఛలో హైదరాబాద్' కు సిద్దమే..: శ్రీధర్ బాబు హెచ్చరిక

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులతో 'ఛలో హైదరాబాద్' కు సిద్దమే..: శ్రీధర్ బాబు హెచ్చరిక

Published : Sep 19, 2022, 05:34 PM IST

పెద్దపల్లి : తమ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన ఆందోళనలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు మద్దతు తెలిపారు.

పెద్దపల్లి : తమ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన ఆందోళనలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు మద్దతు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఆర్జీ3 జీఎం కార్యాలయం ముందు సింగరేణ కార్మికులు చేపట్టిన ఆందోళనలో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై, వారిని రాజకీయాల కోసం వాడుతున్నారంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. హత్యలు, దోపిడీలు చేసేవారిని పట్టుకోవాల్సిన పోలీసులు తమ సమస్యల పరిష్కారానికై ప్రజలు చేపట్టే ధర్నాలు, ఆందోళనలను అణచివేయడమే పనిగా పెట్టుకున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. 

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ ఆదేశాలను సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నారు. కోర్టు ఆదేశాలమేరకు కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు అమలుచేయాలని డిమాండ్ చేసారు. కోల్ ఇండియాలో మాదిరిగానే సింగరేణిలోనూ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు అందించాలని కోరారు. ఈ నెల 22న జేఏసి జరిపే చర్చలు ఫలించకుంటే ఛలో హైదరాబాద్ కు పిలుపునివ్వాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సూచించారు. 
 

03:20Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
17:40అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu
52:11Hyderabad Petrol:పెట్రోల్ బ్యాంకుల్లో నోస్టాక్ బోర్డులు క్యూ క‌డుతోన్న ప్ర‌జ‌లు| Asianet News Telugu
03:18పెట్రోల్ సంక్షోభం రానుందా.? ఎందుకీ భారీ క్యూలు.? | Asianet News Telugu
05:10Panic at Hyderabad Gas Stations: యుద్ధం ఎఫెక్ట్! హైదరాబాద్‌లో గ్యాస్ కోసం బారులు | Asianet Telugu
04:31పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి | Asianet News Telugu
06:08Fuel Rate Hike: పెరిగిన పెట్రోల్ ధరలు.. బంకుల్లో వాహనదారుల కష్టాలు చూడండి | Asianet News Telugu
07:47Hyderabad Petrol:పెట్రోల్ బ్యాంకుల్లో నోస్టాక్ బోర్డులు క్యూ క‌డుతోన్న ప్ర‌జ‌లు| Asianet News Telugu
03:07VC Sajjanar: రిక్వెస్ట్ యాక్షప్ట్ చేస్తే మీ పని అంతే! సైబర్ మోసాలపై హెచ్చరిక! | Asianet News Telugu
14:19గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో CM Revanth Reddy Speech | Gaddar Awards | Asianet News Telugu