జనగామలో భారీ వర్షాలు... వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి పర్యటన

జనగామలో భారీ వర్షాలు... వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి పర్యటన

Published : Jul 14, 2022, 05:11 PM IST

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు జనావాసాలు, పంటలను ముంచెత్తుతున్నాయి.

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు జనావాసాలు, పంటలను ముంచెత్తుతున్నాయి. వరద నీరు పోటెత్తడంతో నదులు, వాగులువంకలు ఉదృతంగా ప్రవహిస్తూ జలాశయాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, చెరువులు నిండిపోయి ప్రమాదకరంగా మారాయి. ఈ క్రమంలో జనగామ జిల్లాలో వర్షాలు, వరదల తాజా పరిస్థితులపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమావేశమైన మంత్రి తాజా పరిస్థితిపై ఆరా తీసారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న సమయంలోనే కాదు ఈ వానాకాలం మొత్తం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.  వర్షాలు, వరద ప్రభావం తగ్గిన తర్వాత అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాలలో మంత్రి ఎర్రబెల్లి వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సందర్శించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి అక్కడి తాజా పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఇప్పగూడెంలో హరితహరంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి మొక్కలు నాటారు.
 

05:51క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవంలో వెంకయ్య నాయుడు పవర్ ఫుల్ స్పీచ్ | Venkaiah Naidu Powerful Speech
17:28నేను సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు హార్డ్‌వేర్ కూడా.. రేవంత్ రెడ్డి KTR స్ట్రాంగ్ కౌంటర్ | Asianet Telugu
02:44సంధ్య థియేటర్ కేసు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్ | Asianet News Telugu
03:17Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
22:19CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
14:43Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్
21:44CM Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో విద్యార్థులకుసీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్| Asianet Telugu
10:42మీరు నా గుండె చప్పుడు జనసేన తెలంగాణ కార్యాలయ ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ | Asianet News Telugu
11:58JanaSena Telangana New State: హైదరాబాద్ మణికొండలో జనసేన తెలంగాణ నూతనరాష్ట్ర కార్యాలయం ప్రారంభం
02:08Pawan Kalyan మీద దేశద్రోహం కేసు పెట్టాలి: Kalvakuntla Kavitha | Asianet News Telugu