Mar 12, 2023, 1:58 PM IST
జగిత్యాల జిల్లా వెల్గటూరులో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మండల కేంద్రంలో నివాసముంటున్న శ్రీనివాస్ కుటుంబంతో కలిసి గత రెండ్రోజులుగా ఇంటికి తాళం వేసి శుభకార్యానికి, ఆ తర్వాత హాస్పిటల్ కు వెళ్లారు. శ్రీనివాస్ కుటుంబం తిరిగివచ్చేసరికి దొంగలు ఆ ఇంటిని ఊడ్చేసారు.ఇంట్లోని 25 తులాల బంగారం, లక్షా యాభైవేల నగదును దొంగిలించి సిసి కెమెరాలను ధ్వంసం చేసారు.
ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు వెల్గటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం, డాగ్ స్వాడ్ తో పాటు దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. రెక్కీ నిర్వహించి తాళం వేసి వుండటాన్ని చూసే దొంగలు ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆ ఇంటి సమీపంలోని సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.