సిసోడియా లాగే త్వరలోనే కవిత జైలుకు..: తిరుమలలో బిజెపి కీలక నేత సంచలనం

సిసోడియా లాగే త్వరలోనే కవిత జైలుకు..: తిరుమలలో బిజెపి కీలక నేత సంచలనం

Published : Feb 27, 2023, 03:51 PM IST

తిరుపతి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టవడం ఖాయమంటూ తెలంగాణ బిజెపి నాయకులు వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. 

తిరుపతి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టవడం ఖాయమంటూ తెలంగాణ బిజెపి నాయకులు వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. డిల్లీ లిక్కర్ స్కాం లో డిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాదిరిగానే కవిత కూడా త్వరలోనే జైలుకు వెళుతుందన్నారు. లిక్కర్ స్కాంలో ఇంకా చాలామందిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని వివేక్ అన్నారు. సోమవారం కుటుంబసభ్యులతో కలిసి వివేక్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సిసోడియా అరెస్ట్ పై స్పందిస్తూ కవితకు లిక్కర్ స్కాంతో సంబంధాలున్నాయని స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. ఇటీవల పంజాబ్ గుజరాత్ ఎన్నికల ఖర్చు కోసం కేజ్రీవాల్ కు డబ్బులు అవసరం... దీన్ని గుర్తించే కవిత అతడితో ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. ఇలా ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత రూ.150 కోట్లు ముట్టచెప్పిందని అన్నారు. డిల్లీతో పాటు ఇటీవలే ఆప్ అధికారంలోకి వచ్చిన పంజాబ్ లోనూ లిక్కర్ స్కాం చేయాలని భావించారని... ఇంతలోనే ఈ బండారం బయటపడిందని వివేక్ అన్నారు. 

08:27Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం స్థంబించిన ట్రాఫిక్ | Asianet News Telugu
09:03ఇక్కడకూడా మహిళల పెత్తనమే వస్తది.. సీఎం రేవంత్ రెడ్డి పంచ్ లు | CM Revanth Reddy Funny Punches
05:00IPS Officer Uday Krishna Reddy Controversy Explained | Harassment Allegations & Viral Letter
03:12తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక ఈ జిల్లాలలో భారీ వర్షాలు| Big Alert for AP & Telangana
03:36😂🤣 KTR Shares Funny Incident : మెడపై కత్తిపెట్టి నాది పులివెందుల అన్నాడు | Asianet News Telugu
03:39బోనాలు వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి | Ujjaini Mahankali Blessings for Telangana | Bonalu
35:19CM Revanth Reddy Speech: అందెశ్రీ తలచుకుని సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ స్పీచ్ | Asianet News Telugu
20:15వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్పీచ్ | CM Revanth Reddy Speech on Telangana Education
14:15తెలంగాణలో భారీ పెట్టుబడులు అమెజాన్ డేటా సెంటర్ కు శంకుస్థాపన | Amazon Data Centre in Telangana
05:06మీ కళ్లు చల్లబడ్డాయా?: Singer P Susheela emotional on Singer S Janaki's demise | Asianet News Telugu