కదిలేదే లేదు... కనీసం మా పిల్లలకైనా ఒక సమర్థ, సుస్థిర దేశం కావాలి : శ్రీలంక నిరసనకారులతో గ్రౌండ్ జీరో నుంచి

Jul 14, 2022, 9:27 AM IST

శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. ఎమర్జెన్సీ విధించినప్పటికీ... నిరసనకారులు తగ్గేదేలే అంటూ శ్రీలంక అధ్యక్షా భవనం నుంచి బయటకు వెళ్లేదేలా అంటున్నారు. ఆర్మీ, పోలీస్ అధికారులను విక్రమసింఘే పరిస్థితిని అదుపులోకి తీసుకురమ్మని చెప్పినప్పటికీ... ఒకవేళ పోలీసులు రంగప్రవేశం చేస్తే పరిస్థితి మరింత అదుపుతప్పొచ్చనే అనుమానం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో గ్రౌండ్ జీరో నుంచి ఏషియానెట్ న్యూస్ మీకోసం ఎక్సక్లూసివ్ గా అక్కడి నిరసనకారులతో మాట్లాడుతూ వారి మనోభావాలను, వారు ఏమి కోరుకుంటున్నారో మీ ముందుకు తీసుకొస్తుంది..!