చెన్నై వర్సెస్ కోల్‌కత: అద్భుత విజయం సాధించిన ధోని సేన, కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం

30, Oct 2020, 1:16 AM

IPL 2020 సీజన్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాను అందించింది. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆఖరి బంతికి విజయం అందుకుంది. 2 బంతుల్లో 7 పరుగులు కావాల్సినదశలో ఆఖరి రెండు బంతుల్లో 2 సిక్సర్లు బాది విజయాన్ని అందించాడు రవీంద్ర జడేజా. ప్లేఆఫ్ రేసు నుంచి దూరమైన తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్.