Jul 13, 2023, 11:12 AM IST
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో చిత్తుగా ఓడి, నెల రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చారు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు, 64.3 ఓవర్లలో 150 పరుగులకి ఆలౌట్ అయ్యింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అశ్విన్ 5 వికెట్లతో విండీస్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. తొలి సెషన్‌లో 4 వికెట్లు తీసిన భారత బౌలర్లు, రెండో సెషన్‌లోనూ నాలుగు వికెట్లు పడగొట్టి, మూడో సెషన్ మొదటి పావుగంటలోనే... విండీస్‌ని ఆలౌట్ చేసేశారు. టీమిండియా తరుపున 700లకు పైగా అంతర్జాతీయ వికెట్లు తీసిన మూడో బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. అనిల్ కుంబ్లే 956 వికెట్లతో టాప్‌లో ఉంటే, హర్భజన్ సింగ్ 711 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ అయిపోయాక అశ్విన్ మీడియాతో ముచ్చటించాడు.