Jan 12, 2021, 2:50 PM IST
ఆస్ట్రేలియా తో టెస్టులో టీమిండియా అద్వితీయమైన ప్రదర్శనతో ఓటమి ఖాయమనుకున్న మ్యాచును డ్రా గా ముగించింది. ఈ మ్యాచులో టీమిండియా బ్యాట్స్ మెన్ చూపిన తెగువ ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతంగా నిలిచిపోనుంది. ఈ మ్యాచులో పంత్ టీం మూడ్, టోన్ ని సెట్ చేస్తే తెలుగు బిడ్డ విహారి తన గాయాన్ని కూడా లెక్క చేయకుండా, తన కెరీర్ నే రిస్క్ లో పెట్టి మరీ అసామాన్య పోరాట పటిమ ద్వారా మ్యాచును డ్రా గా ముగించాడు.